Join Dafanews today and get to enjoy our Free to Play Games.
Join Dafanews

Welcome, !

You have successfully created your account. You can now enjoy our FREE TO PLAY GAMES

Play Now Play Now

Welcome, !

You have successfully created your account. You can now enjoy our FREE TO PLAY GAMES or access our wide range of DAFABET products

Can't Login?

Stay in Loop!

Join our Telegram community for the latest sports news, highlights, live scores, and more.


వ్రాసిన వారు Website Admin
వినేష్ ఫోగట్: మనం మననం చేసుకోవాల్సియున్న దన్-గర్ల్ గురించి

వినేష్ ఫోగట్: మనం మననం చేసుకోవాల్సియున్న దన్-గర్ల్ గురించి

November 12, 2019

2016 సంవత్సరం బాలీవుడ్ లో ‘ఎం.ఎస్. ధోనీ’ వంటి జీవితచరిత్రల చిత్రణకు ఒక పెద్ద సంవత్సరంగా ఉండినది: చెప్పని కథ’ మరియు ‘రుస్తుం’ అనేవి బాక్స్ ఆఫీస్ వద్ద అసంఖ్యాకమైన రికార్డులను బద్దలు కొడుతూ విపరీతంగా నగదును సంపాదించిపెట్టాయి. కొంతకాలం పాటు బయోపిక్స్ (జీవితచరిత్రలు) భారీ విజయాలను నమోదు చేసుకోగా, ఏ చిత్రం కూడా అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ కంటే ఎక్కువగా తన ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

అది భారతీయ రెజ్లర్లు (కుస్తీదారులు) గీతా మరియు బబితా ఫోగట్ తమ తండ్రితో నివసిస్తుండగా ఇండియా కోసం ఒక బంగారు పతకం సాధించాలనే స్వప్నాన్ని సాకారం చేసుకునేందుకు చేసిన ప్రయోగాలు మరియు కష్టనష్టాల నిజజీవితం ఆధారంగా చిత్రీకరించబడిన చిత్రం. విమర్శకులచే బ్లాక్ బస్టర్ గా కీర్తించబడిన ఈ చిత్రం కేవలం భారతీయ సినిమాలో అత్యధికంగా ఆర్జించిన ఆల్-టైమ్ రికార్డును నెలకొల్పడమే గాకుండా ఫోగట్ సోదరీమణుల స్ఫూర్తిదాయక మరియు విజయగాధను వెలుగులోనికి తెచ్చింది. ఈ చిత్రం మొత్తంగా మహావీర్ సింగ్ యొక్క ఇద్దరు స్వంత కూతుళ్ళ ఆధారంగా తీసినది కాగా, దాని సీక్వెల్ (మనకు తెలిసీ అది రాబోతోంది) మాత్రం అతని మేనకోడలు వినేష్ ఫోగట్ ఆధారితమై ఉండవచ్చు.

రెజ్లింగ్ సూపర్ స్టార్లు నిండుగా ఉన్న కుటుంబము నుండి వచ్చిన వినేష్ కూడా, ఆమె సోదరీమణుల మార్గాన్నే అనుసరించింది మరియు అంతర్జాతీయ వేదికపై ఒక వరుస విజేతగా నిలుస్తూ వస్తోంది. గీతా మరియు బబిత లాగానే వినేష్ కూడా తన బాల్యంలో అత్యధిక శిక్షణా సమయాన్ని మహావీర్ సింగ్ యొక్క బోధనాపూర్వక శిక్షణ క్రిందనే గడిపింది. 9 సంవత్సరాల లేత వయసులోనే ఆమె తన తండ్రిని కోల్పోయింది, కాబట్టి మేనమామ మహావీర్ సింగ్ ఆమె జీవితంలో తండ్రి స్థానములో అడుగు పెట్టాడు. ఈ దశాబ్దం యొక్క తొలినాళ్ళలో ఆమె దేశీయంగా ఆధిపత్యం వహించగా, తోటి రెజ్లర్ సోమ్‌వీర్ రాథీని కూడా ఆమె కలిసింది, అతణ్ణి 2018 డిసెంబరులో ఆమె వివాహం చేసుకొంది.

ఆమె కెరీర్ వాస్తవంగా 2013 ఆసియా క్రీడల సందర్భంగా ప్రారంభం కాగా, అందులో ఆమె 52 కిలోల ఫ్రీ స్టైల్ విభాగములో కాంస్య పతకాన్ని గెలుపొందింది. కామన్‌వెల్త్ ఛాంపియన్‌షిప్స్ ఫైనల్ లో ఒడునాయో అడెక్యురోయే చేతిలో ఓటమి చెంది రజత పతకాన్ని పొందిన నెలల అనంతరం ఆమె తన పనితీరును మెరుగుపరచుకొంది. ఆ రెండు ఈవెంట్లలోని ఆమె అనుభవం ఆ తదుపరి ఏడాది ఆమె మూడవ పతకం పొందడానికి దారితీసి ఉండవచ్చు, ఎందుకంటే ఆమె 2010 లో అగ్రశ్రేణి బహుమతి కూడా పొందిన సోదరి గీతా ఫోగట్ అడుగు జాడలను అనుసరిస్తూ 2014 కామన్‌వెల్త్ క్రీడలలో బంగారు పతకాన్ని సాధించింది.

2014 ఆసియా క్రీడలలో ఒక కాంస్యం, తదుపరి వరుసగా 2015 మరియు 2016 ఏషియన్ ఛాంపియన్‌షిప్స్ లో రజతం మరియు కాంస్యం, ఇవన్నీ రియోఒలంపిక్స్ దిశగా వినేష్ సంసిద్ధతలకు ఖచ్చితమైనవిగా కనిపించాయి, అయినప్పటికీ, గ్యారంటీగా పతకం గెలుపొందడానికి కేవలం ఒక మ్యాచ్ దూరంలో ఉండగా సున్ యనాన్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో, వినేష్ ఒక విధ్వంసకరమైన ఎ.సి.ఎల్ చీలికతో బాధపడింది, ఊరించిన ఒలంపిక్ రజతాన్ని పణంగా పెడుతూ ఆమె ముంబైకి తిరిగి వచ్చిన మీదటనే అది నిర్ధారణ చేయబడింది.

అలా గాయపడ్డం ఆమెను కొంత కాలం పాటు తన కార్యక్రమాలకు దూరంగా ఉంచింది. ఐతే, అదేదో సామెత చెప్పినట్లుగా, తిరిగిరావడమనేది ఎల్లప్పుడూ కుదురుబాటుకంటే ఘనంగా ఉంటుంది. మరి వినేష్ ఉదంతములో, అది ఉజ్వలంగా అల్లుకుపోయింది. 2017 ఆగస్టులో ఏషియన్ ఛాంపియన్‌షిప్ వేదికకు ఆమె తిరిగిరాగానే, తృటిలో అత్యున్నత బహుమతిని చేజార్చుకొని ఒక రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఒక సంవత్సరం తర్వాత, ఫిబ్రవరిలో, ఆమె మరొక్కసారి వెళ్ళింది, ఏషియన్ ఛాంపియన్‌షిప్స్ యొక్క ఫైనల్ లో చైనాకు చెందిన లీ ఛున్ చేతిలో ఓటమిపాలై మళ్ళీ రజతాన్ని పొందింది. రెండు సూటి ఈవెంట్లలో కాస్తలో వెనుకబడిన తర్వాత, వినేష్, గోల్డ్ కోస్ట్ లోని కామన్‌వెల్త్ క్రీడల్లో పాల్గొనడానికి వెనుకంజ వేయలేదు, రెండుసార్లు బంగారు పతకం సాధించిన సోదరి బబితా కుమారిని అనుకరిస్తూ అందులో ఆమె రెండో కామన్‌వెల్త్ బంగారు పతకం సాధించింది.

వినేష్ ఇటీవలనే నూర్-సుల్తాన్ లో ముగిసిన ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్ లో మొట్టమొదటగా పాల్గొని ఒక కాంస్య పతకాన్ని సాధించి నానాటికీ పెరుగుతున్న తన పతకాల సరసన జోడించింది. కేవలం 25 ఏళ్ళ వయసులో, వినేష్, భారతీయ రెజ్లింగ్ ఘనతగా తన స్థానానికి ఇప్పటికే గట్టి పునాదిని వేసుకొంది. అయినప్పటికీ, తన మెడలో ఒక ఒలంపిక్ పతకాన్ని ధరించి స్వదేశానికి తిరిగి వస్తే గానీ ఆమె పతకాల వేట కథ సంపూర్ణము కాజాలదు. టోక్యో 2020 కేవలం కొద్ది దూరములో మాత్రమే ఉండగా, వినేష్ ఇదివరకెన్నడూ లేనంతగా కఠోరంగా శ్రమిస్తోంది. మరి ఒకవేళ ఆమె గనక ఒక ఒలంపిక్ పతకాన్ని గెలుచుకొని, ఆమె కుటుంబములో అలా గెలుపొందిన మొదటి వ్యక్తిగా నిలిస్తే మాత్రం, మనం ఆమె కథను వెండితెరకు ఎక్కించాల్సి ఉంటుంది.

రచన: క్రీడా ముఖాముఖీ

రచయిత గురుంచి


వ్రాసిన వారు Website Admin

×
Embed Code